ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Girl suicide: బాలిక ఆత్మహత్య.. డైరీలో ఏం రాసిందంటే..! - ఆంధ్రా న్యూస్

17 ఏళ్ల బాలిక రెండు రోజుల క్రితం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు రాకముందే కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. తల్లిదండ్రులు పొంతనలేని సమాధానంతో..పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

Girl commits suicide
Girl commits suicide

By

Published : Aug 21, 2021, 7:44 AM IST

గుంటూరు జిల్లా కాకుమాను పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ బాలిక (17) 2 రోజుల క్రితం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు రాకముందే అంత్యక్రియలు పూర్తి చేయడం, విచారణలో ఆమె తల్లిదండ్రులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతురాలు తన డైరీలో అన్నయ్యకు మంచి జీవితం ఇవ్వాలనుకున్నానని రాసింది.

దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని అందులో మరికొన్ని విషయాలు ఉన్నాయని దర్యాప్తు చేస్తున్నారు. డైరీలోని విషయాల సారాంశం ఏమిటి? బాలిక ఎందుకు, ఎలా చనిపోయిందని పోలీసులు శుక్రవారం నుంచి దర్యాప్తు ముమ్మరం చేశారు. సచివాలయ మహిళా పోలీసు మృతురాలి ఇంటికి చేరుకుని పోలీసులు వచ్చేవరకూ అంత్యక్రియలు చేయొద్దని చెప్పినా.. ఆ లోపే దహనం చేయడం అనుమానాలకు తావిస్తోంది.

మృతిపై అనుమానాలు

‘డైరీతో పాటు పురుగుల మందు డబ్బా స్వాధీనం చేసుకున్నాం. ఆత్మహత్యకు పాల్పడితే ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అలా చేయకపోవడం వలన అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నాం. అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశంలో ఎముకలు సేకరించాం. ఎవరిదో పుట్టినరోజుకు వెళ్లి వచ్చాక వాంతులు చేసుకుందని ఒకసారి, ఆరోగ్యం బాగోలేదని మరోసారి కుటుంబీకులు చెప్పారు. సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయి.’- శ్రీనివాసరావు, బాపట్ల డీఎస్పీ

ఇదీ చదవండి: polavaram : పోలవరం రివైజ్డ్‌ అంచనాలు..హైదరాబాదే దాటలేదు

ABOUT THE AUTHOR

...view details