కృష్ణా జిల్లా పోలవరం కుడి కాల్వలో గల్లంతైన చిన్నారి మృతదేహం లభ్యమైంది. స్నేహితులతో కలిసి చిన్నారి చింతల నాంచారమ్మ(7) బహిర్భూమికి వెళ్లింది. ఆ సమయంలోనే గన్నవరం మండలం కొత్తగూడెం వద్ద నిన్న సాయంత్రం గల్లంతైంది. విషయం గుర్తించిన బాలిక స్నేహితులు తల్లిదండ్రులకు, గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నాంచారమ్మ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గొల్లనపల్లి లాక్‌లు మూసివేయడం వల్ల తెల్లారేసరికి చిన్నారి మృతదేహాన్ని గుర్తించగలిగారు.
పోలవరం కుడి కాల్వలో గల్లంతైన చిన్నారి మృతదేహం లభ్యం - ap 2021 news
స్నేహితులతో కలిసి బహిర్భూమికి వెళ్లిన నాంచారమ్మ అనే చిన్నారి పోలవరం కుడి కాల్వలో పడి నిన్న గల్లంతైంది. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టగా... ఈరోజు నాంచారమ్మ(7) మృతదేహం లభ్యమైంది.
పోలవరం కుడి కాల్వలో గల్లంతైన చిన్నారి మృతదేహం లభ్యం