ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

నెల్లూరు జిల్లాలో పేలిన గ్యాస్​ సిలిండర్లు.. ఒకరు మృతి - వావిళ్లలో గ్యాస్​ సిలిండర్లు పేలుడు

వావిళ్లలోని ఓ టిఫిన్​ సెంటర్​లో గ్యాస్​ సిలిండర్లు పేలాయి. భారీ శబ్ధం రావడంతో స్థానికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకుని.. అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పుతున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

gas cylinder blast
gas cylinder blast

By

Published : Nov 25, 2022, 9:19 PM IST

Updated : Nov 25, 2022, 10:32 PM IST

నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో గ్యాస్ సిలిండర్లు పేలాయి. స్టానికంగా ఉన్న టిఫిన్ సెంటర్​లో భారీ శబ్దంతో సిలిండర్లు పేలి.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న రమణమ్మ అనే మహిళ మృతి చెందింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

Last Updated : Nov 25, 2022, 10:32 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details