Gangster Nayeem follower sheshanna in Police Custody: గ్యాంగ్స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తపేటలోని ఓ రెస్టారెంట్లో సెటిల్మెంట్ చేస్తుండగా పోలీసులు దాడి చేసి అతడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఓ పిస్తోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అచ్చంపేటకు చెందిన శేషన్న.. కొంతకాలం పీపుల్స్ వార్ గ్రూపులో పని చేసి ఆ తర్వాత లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు.
పోలీసుల అదుపులో గ్యాంగ్స్టర్ నయీం ప్రధాన అనుచరుడు.. సెటిల్మెంట్ చేస్తుండగా..! - Gangster Nayeem follower sheshanna
Gangster Nayeem follower sheshanna in Police Custody: గ్యాంగ్స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో కొత్తపేటలోని ఓ రెస్టారెంట్లో సెటిల్మెంట్ చేస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి ఓ పిస్తోల్ స్వాధీనం చేసుకున్నారు.
Gangster Nayeem follower sheshanna in Police Custody
అప్పటి నుంచి నయీం ప్రధాన అనుచరుడిగా కొనసాగుతూ.. బెదిరింపులు, హత్యలు, హత్యాయత్నాల వంటి అనేక కేసుల్లో నయీంతో పాటు శేషన్న కూడా నిందితుడుగా ఉన్నాడు. 2016లో షాద్నగర్లో జరిగిన ఎంకౌంటర్లో నయీం మృతి చెందగా.. అప్పటి నుంచి శేషన్న పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్నాళ్లకు సరైన సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు శేషన్నను పట్టుకున్నారు.
ఇవీ చదవండి: