విశాఖ జిల్లా గాజువాక అగనంపూడి టోల్ గేట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బొలెరో వాహనంలో ధాన్యం పొట్టు బస్తాల మాటున.. సుమారు 300 కిలోల గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పాడేరు నుంచి పశ్చిమబంగాకు.. అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారంతో.. పోలీసులు కాపు కాశారు. వాహనాన్ని ఆపి తనీఖీ చేయగా.. అందులోని బస్తాల్లో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. బొలెరో వాహనాన్ని సీజ్ చేసినట్లు దువ్వాడ సీఐ లక్ష్మీ తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న 300కిలోల గంజాయి పట్టివేత - విశాఖ జిల్లా ఆగనంపూడి వద్ద గంజాయి పట్టివేత
విశాఖ జిల్లా గాజువాక అగనంపూడి టోల్ గేట్ వద్ద.. అక్రమంగా తరలిస్తున్న 300 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ధాన్యం పొట్టు బస్తాల మాటున.. బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. వాహనాన్ని సీజ్ చేశారు.
అక్రమంగా తరిలిస్తున్న 300కిలోల గంజాయి పట్టివేత