హైదరాబాద్ : మహిళపై సామూహిక అత్యాచారం.. ఆటోలో తీసుకెళ్లి దారుణం - telangana news
10:53 October 14
రాజేంద్రనగర్‌లో మహిళపై సామూహిక అత్యాచారం
ఆడవారిపై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా మహిళలపై అరాచకాలను అడ్డుకోలేకపోతున్నారు. తాజాగా.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో మహిళపై కొందరు కీచకులు సామూహిక అత్యాచారానికి(Gang Rape at Rajendranagar) పాల్పడ్డారు. ఆటోలో తీసుకెళ్లి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని, బాధితురాలు ఆణె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అత్యాచారం(Gang Rape at Rajendranagar) చేసిన అనంతరం మెడలోని పుస్తెలతాడు, తన వద్ద ఉన్న నగదు కూడా దోచుకెళ్లినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: Covid cases in India: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు