ప్రస్తుతం విశాఖలో 60 వరకు కేంద్రాలు ఆధార్ సేవలు అందిస్తున్నాయి. అనుమతించిన బ్యాంకులు, పోస్టాఫీసులు, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో ఉన్న మీ-సేవ కేంద్రాలు, సీఎస్‌సీలు, ఆసుపత్రుల వద్ద ఉండే బాల ఆధార్ కేంద్రాల ద్వారా ఈ సేవలు అందుతున్నాయి. కొన్ని చోట్ల ప్రజలు వీటిని ఆశ్రయించే క్రమంలో మధ్యవర్తులు ముందుగానే సంప్రదించి తామే ఆ పనులన్నీ త్వరగా చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆయా కేంద్రాల్లో తెలిసిన వారున్నారని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.500 వరకూ లాగేస్తున్నారు.
*గాజువాక, పెందుర్తి, అనకాపల్లి, నగరంలోని కొన్ని ఇంటర్నెట్ కేంద్రాలు వారు నిర్ణీత రుసుం కన్నా అధికంగా డిమాండు చేస్తున్నారు. కొన్ని రకాల సేవలు ఉచితంగా అందించాల్సి ఉన్నా ఆ విషయమే పక్కనపెట్టేశారు. రూ.50 చెల్లించాల్సిన వాటికి కూడా రూ.200 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు.
మోసాలు ఇలా: ఆధార్ వివరాల మార్పుల కోసం ముందు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారు ఎవరైనా స్వయంగా చేసుకోవచ్ఛు తెలియని వాళ్లు ఇంటర్నెట్ కేంద్రాలకు వెళ్తే చేస్తారు. అసలు మోసం ఇక్కడే జరుగుతుంది. కేవలం స్లాట్ బుకింగ్‌కు రూ.20 తీసుకోవాలి. కానీ, రూ. 200 వరకు తీసుకుంటున్నారు. తామే ఆ పనులు చేస్తామంటూ ఇలా అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు.
- ఆధార్ సేవా కేంద్రాల్లో కొత్తగా దరఖాస్తు చేసే వారి నుంచి ఎటువంటి రుసుం వసూలు చేయకూడదు. అయినా కొందరి నుంచి పలు కేంద్రాల్లో రూ.200 నుంచి రూ. 500 వరకు తీసుకుంటున్నారు.
- ఆధార్ సేవలు పొందాలంటే ముందుగా ఎన్‌రోల్‌మెంట్ పత్రం నింపాలి. దీన్ని ఎక్కడైనా ఉచితంగా పొందొచ్ఛు ఇంటర్నెట్ సెంటర్లలో రూ.20కి అమ్ముతున్నారు.
- అయిదేళ్లు దాటిన చిన్నారులకు తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయించాలి. ఈ సేవలు పూర్తిగా ఉచితంగా అందించాలి. కానీ, రూ.500 వరకూ దండుకుంటున్నారు. రోజుకు వివిధ రకాల సేవల కోసం వందమంది వస్తే...వారిలో 30 మంది వీరే ఉంటారు.
- చిరునామా మార్చాల్సిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం గజిటెడ్ సర్టిఫికేట్ జత చేయాలి. ఇలా చేయటానికి కొందరు ఏకంగా వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు. నగరంలో కొందరు వైద్యులు, ఇతర అధికారుల సంతకాలతో చేయించి సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు.
- కేజీహెచ్, మరికొన్ని ఆసుపత్రుల వద్ద పుట్టిన వెంటనే పిల్లలకు ఆధార్ చేయించేందుకు బాల ఆధార్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో ఇటువంటివి నాలుగైదు, చోట్ల నడుస్తున్నాయి. వీరు ఉచితంగా సేవలందించాలి. అయినా కొందరు సొమ్ము వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇంటర్నెట్ కేంద్రం అడ్డాగా...