Four died in road accident: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. చింతపల్లి మండలం మడిగుంట ఘాట్‌రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. అక్కడికక్కడే ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని అంబులెన్స్‌లో నర్సీపట్నం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ఇద్దరూ మృతి చెందారు. మరొకరిని విశాఖ కేజీహెచ్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతులు పాంగి మత్యరాజు, సన్నీ, సన్యాసిరావు, గుంట జోసెఫ్‌గా పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరు పాడేరు డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో నాలుగుకు చేరిన మృతుల సంఖ్య - Four young mans died
Four died in road accident ఒక్క రోడ్డు ప్రమాదం నాలుగు నిండుప్రాణాలను బలి తీసుకుంది. నాలుగు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తమకు అండగా నిలుస్తారనుకున్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. అసలేం జరిగిందంటే.
రోడ్డు ప్రమాదం