ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ఓబుళాపురం మైనింగ్ అక్రమాల కేసు.. ఎండీకి నాలుగేళ్ల జైలు శిక్ష - ఓబుళాపురం మైనింగ్ ఎండీ శ్రీనివాసరెడ్డికి జైలు శిక్ష

OMC MD: ఓబుళాపురం మైనింగ్ కంపెనీలో అక్రమాలు ఇంకా కొందర్ని వెంటాడుతున్నాయి. 2008లో అనుమతికి మించి ఇనుప ఖనిజం తరలిస్తున్నారని జిల్లా అటవీశాఖ అధికారి కల్లోల్ బిశ్వాస్ సిబ్బందితో కలసి మైనింగ్ ప్రదేశానికి వెళ్లగా.. ఓఎంసీ ఎండీ శ్రీనివాస్ రెడ్డి అడ్డుకుని, విధులకు ఆటంకం కలిగించారని కేసు వేశారు. ఈ కేసులో తాజాగా ఓఎంసీ ఎండీ శ్రీనివాసరెడ్డికి రాయదుర్గం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జైలు శిక్ష విధించింది.

OMC MD
అక్రమాల కేసులో ఓఎంసీ ఎండీ శ్రీనివాసరెడ్డికి.. నాలుగేళ్ల ఒక నెల జైలు శిక్ష..!

By

Published : May 20, 2022, 2:05 PM IST

OMC MD: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో ఓఎంసీ ఎండీ శ్రీనివాసరెడ్డికి.. అనంతపురం జిల్లా రాయదుర్గం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జైలుశిక్ష విధించింది. 2008లో ఓబుళాపురం పరిధిలో ఓఎంసీ నిర్వాహకులు అనుమతికి మించి ఇనుప ఖనిజం తరలిస్తున్నారన్న సమాచారం పేరుతో.. జిల్లా అటవీశాఖ అధికారి కల్లోల్ బిశ్వాస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు.

అయితే.. విచారణకు వెళ్లిన తమను ఓఎంసీ ఎండీ శ్రీనివాసరెడ్డి అడ్డుకుని, విధులకు ఆటంకం కలిగించారంటూ కల్లోల్ బిశ్వాస్ కేసు వేశారు. ఈ అంశంపై.. ఏళ్లుగా విచారణ సాగింది. సాక్షులను విచారించిన అనంతరం.. శ్రీనివాసరెడ్డిని కోర్టు దోషిగా నిర్ధరించింది. ఈ కేసులో నాలుగేళ్ల ఒక నెల జైలు శిక్ష, మూడు సెక్షన్ల కింద 8,500 రూపాయల జరిమానా విధించింది. దీనిపై....శ్రీనివాసరెడ్డి పైకోర్టుకు అప్పీల్​కు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details