బట్టల దుకాణంలో కౌంటరుపై ఉన్న బాలికను నలుగురు మహిళలు మాటల్లో పెట్టి దొంగతనానికి పాల్పడ్డారు. రూ. 20 వేల విలువగల చీరలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన తెలంగాణ కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర సారీ సెంటర్లో జరిగింది. మహిళలు చీరలను చోరీ చేసే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. షాపు యజమాని ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
పట్టపగలే చోరీ.. రూ. 20వేల విలువగల చీరలు స్వాహా - సీసీ కెమెరా
ఓ బట్టల దుకాణంలో పట్టపగలే చోరీ జరిగింది. నలుగురు గుర్తు తెలియని మహిళలు.. చీరలను ఎత్తుకెళ్లే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
CHORI