ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Accident: ఎదురెదురుగా రెండు కార్లు ఢీ... నలుగురు దుర్మరణం

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.

Accident
Accident

By

Published : Jun 19, 2021, 9:56 AM IST

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొడంగల్‌ శివారులో ఎదురెదురుగా వచ్చిన కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. హైదరాబాద్‌ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న వాహనం.. ఎదురుగా వచ్చిన కారును బండ ఎల్లమ్మ ఆలయం వద్ద ఢీకొట్టింది.

ఈ ఘటనపై.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు... మృతదేహాలను వాహనాల్లో నుంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details