తెలంగాణలో విషాదం.. ఈతకు వెళ్లి ఒకే కుటుంబంలో నలుగురి మృతి - ap crime news
16:05 January 16
మృతులు లోకేశ్, వెంకటేశ్, జగదీశ్, రాజేశ్‌గా గుర్తింపు
FOUR PEOPLE DIED : అందరి ఇళ్లల్లో పండుగ సంబరాలు అంబరాన్నంటితే.. ఆ ఇంట్లో మాత్రం విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువుల కేరింతలతో మార్మోగాల్సిన ఆ ఇళ్లలో రోదనలు మిన్నంటాయి. పండుగ పూట సరదాగా గడిపేందుకు బయటికి వెళ్లిన వారు.. తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. ఈ విషాద ఘటన తెలంగాణలో జరిగింది.
వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి ప్రాజెక్టులో పడి నలుగురు యువకులు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా.. పండగ రోజు సరదాగా గడిపేందుకు కోట్‌పల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. ఒడ్డున ఈదుతూ ప్రమాదవశాత్తూ మునిగిపోయారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు గుర్తించి మృతదేహాలను వెలికి తీశారు. మృతులను పూడూరు మండలం మన్నెగూడకు చెందిన లోకేశ్, జగదీశ్, వెంకటేశ్, రాజేశ్‌లుగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: