కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామంలో దారుణం జరిగింది. వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి నాలుగు నెలల పసికందును.. గొంతు నులిమి హత్య చేశాడు. మద్యం మత్తులో హత్య చేసినట్లు సమాచారం. స్థల వివాదాలే పసికందు హత్యకు కారణమా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కేసు నమోదు చేసిన రెడ్డిగూడెం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Murder: నాలుగు నెలల పసికందు హత్య.. గొంతు నులిమి చంపిన మేనమామ.. - కృష్ణా జిల్లా క్రైమ్ వార్తలు
కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామంలో నాలుగు నెలల పసికందును దారుణంగా హత్య చేశారు. వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి గొంతు నులిమి చంపేశాడు.
Murder