Attack on Assistant Engineer: హైదరాబాద్‌లోని టపాఛబుత్ర పరిధిలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్‌పై నలుగురు యువకులు దాడి చేశారు. విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో కార్వాన్ ఎలక్ట్రిక్ అధికారులు పలు ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సమాచారం అందుకున్న సదరు ఇంటికి చెందిన కుటుంబసభ్యులు అసిస్టెంట్ ఇంజినీర్ విజయ్ కుమార్ ఆఫీసుకి వెళ్లి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అధికారులతో యువకులు దుర్భాషలాడారు. ఆగ్రహించిన ఏఈ విజయ్‌కుమార్.. వాళ్లను హెచ్చరించారు.
హెచ్చరింపుతో తీవ్ర ఆవేశానికి గురైన యువకులు.. సబ్ ఇంజినీర్‌పై దాడి చేశారు. అక్కడే ఉన్న సిబ్బంది ఎంత నిలువరించిన ఆగకుండా దాడి చేశారు. ఈ క్రమంలో ఓ యువకుడు ఇంజినీర్పైకి దూసుకొచ్చి.. టేబుల్ ఎక్కి మరీ విజయ్‌కుమార్‌ను కాలితో తన్నాడు. పిడిగుద్దులతో సబ్ ఇంజినీర్ని ఉక్కిరిబిక్కిరి చేశాడు. దీంతో అక్కడ చాలాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ తతంగం మొత్తం అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.