Four died due to Electrocution: తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బీడీ వర్కర్స్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. భార్య, భర్త సహా ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. మృతులు హైమద్ (35), పర్వీన్ (30), అద్నాన్ (4), మాహిమ్ (6)గా పోలీసులు గుర్తించారు. ఇంట్లో విద్యుత్ తీగలు తగిలి నలుగురు కుటుంబసభ్యులు మృతి చెందినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కామారెడ్డిలో విషాదం.. విద్యుదాఘాతంతో నలుగురు మృతి - కామారెడ్డి జిల్లాలోఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Electrocution: కామారెడ్డిలో విషాదం జరిగింది. విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. ఇంట్లో విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

electrocution