గుంటూరు జిల్లా జొన్నలగడ్డ పెట్రోల్ బంకు వద్ద నలుగురు ఆకతాయిలు హల్‌చల్ చేశారు. ద్విచక్రవాహనాలపై పెట్రోల్ బంకు వద్దకు వచ్చిన యువకులు బంకు సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తొలుత బంకులో విధులు నిర్వహిస్తున్న ఓ సేల్స్‌మెన్‌పై గొడవకు దిగి దాడి చేశారు.
CC Video: పెట్రోల్ బంక్ సిబ్బందిపై ఆకతాయిల దాడి.. - Guntur district news
పెట్రోల్ బంకులో నలుగురు యువకులు అర్ధరాత్రి వీరంగం సృష్టించారు. ద్విచక్రవాహనాలపై పెట్రోల్ బంకు వద్దకు వచ్చిన యువకులు.. బంకు సిబ్బందిపై విచక్షణారహితంగా దాడిచేశారు.
Jonnalagadda petrol bank
అక్కడే ఉన్న మరో సేల్స్‌మెన్ వారిని అడ్డుకునేందుకు రావడంతో.. ఇరువురిపైనా సదరు యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో బాధితులు నరసరావుపేట గ్రామీణ పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:Rape Attempt: మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం
Last Updated : Feb 11, 2022, 7:30 AM IST