DIED: కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం ఆలంకొండలో విషాదం చోటు చేసుకుంది. పొలంలోని నీటికుంటలో సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు నీటిలో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందారు. మృతులు గొల్ల సాయి కుమార్(12), గొల్ల కార్తిక్(13), బోయ రాకేష్(12), కమాల్ బాషా(12) గా పోలీసులు గుర్తించారు. సాయికుమార్, కార్తీక్‌లు డోన్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నారు. బోయ రాకేష్ కటారుకొండ పాఠశాలలో 7 వ తరగతి చదువుతున్నాడు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యుదాఘాతం వల్ల చిన్నారులు మృతి చెందిన.. ఇంతవరకు అధికారులు ఎవరూ గ్రామంలోకి రాలేదని గ్రామస్థులు తెలిపారు.
ఈతకు వెళ్లిన బాలురకు కరెంటు షాక్.. నలుగురు దుర్మరణం! - కర్నూలు జిల్లా తాజా వార్తలు
DIED: ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. సరదా కోసం ఈతకు వెళ్లిన చిన్నారులు విగతజీవులుగా తిరిగి రావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సరదాగా ఈతకు వెళ్లారు.. విగతజీవులుగా మారారు