ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

యువతిపై నలుగురితో లైంగికదాడి చేయించి.. ఘాతుకాన్ని వీడియో తీసింది..! - భర్తతో స్నేహంగా ఉంటోందని కిరాయి యువకులతో లైంగిక దాడి

Rape Attempt On Civils Aspirant: ఒక చెట్టు వాడిపోకుండా ఉండాలంటే కావాల్సింది నీళ్లు.. అదే దంపతుల మధ్య విరిసిన ప్రేమ వాడిపోకుండా కలకాలం ఉండాలంటే.. కావాల్సింది నమ్మకం. అది గనకపోయి.. ఆ స్థానంలో అనుమానం అనే చీడ మొదలైందా.. సంసార వృక్షాన్ని మొత్తం నిర్వీర్యం చేసి నేలకూలుస్తుంది. అనుమానమే పెనుభూతమై.. ఎన్నో సంసారాలను కూల్చేసింది... నేరాలకు ఉసిగొల్పి మరెన్నో కుటుంబాలను రోడ్డునపడేసింది. అలా.. ఎన్నో దారుణాలు ఇంకెన్నో విషాదాలను ఒకేసారి మిగిల్చిన ఆ పెనుభూతం.. ఈసారి మరో ఘోరం చేయించింది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​ గచ్చిబౌలిలో జరిగిన ఈ ఘాతుకం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Rape Attempt
Rape Attempt

By

Published : May 29, 2022, 6:07 PM IST

Rape Attempt On Civils Aspirant: ఆనందంగా సాగిపోతున్న భార్యాభర్తల జీవితంలో.. అనుమానమనే భూకంపం వచ్చినప్పుడు.. ఒక్కోసారి తీరని నష్టం వాటిల్లొచ్చు.. కొన్నిసార్లు చిన్నచిన్న ప్రకంపనలతోనే ముగిసిపోవచ్చు. అయితే.. చిన్నగా మొదలైన అనుమానం.. మరికొన్ని సందర్భాల్లో మాత్రం మనిషిని రాక్షసుడిగా మార్చుతుంది. ఆ సమయంలో తాను పడే క్షోభ.. క్రూరంగా మారి ఘోరాలు చేయిస్తుందనటానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని కొండాపూర్ శ్రీరామ్​నగర్​లో గాయత్రి, శ్రీకాంత్ దంపతులు నివసిస్తున్నారు. అదే కాలనీలో ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన 25 ఏళ్ల యువతి కూడా నివాసముంటూ.. సివిల్స్​కి ప్రిపేర్ అవుతోంది. ఒకే కాలనీలో ఉండటం.. శ్రీకాంత్​ కూడా సివిల్స్​కు ప్రిపేర్​ అవుతుండటం వల్ల.. సాధారణంగానే సదరు యువతికి శ్రీకాంత్​కు మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహంగా మారింది. గాయత్రి తన ఆరోగ్యం బాగోలేదని సదురు యువతిని ఇంటికి పిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు బాధితురాలిని గాయత్రి తన ఇంట్లోనే ఉంచుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు కథ ఇక్కడే మొదలైంది.

మొలకెత్తిన అనుమానం: భర్త శ్రీకాంత్‌, యువతి ప్రవర్తనపై గాయత్రి మనసులో అనుమానం మొలకెత్తింది. తన భర్త ఇంకో అమ్మాయితో చనువుగా ఉండటం చూసి గాయత్రి తట్టుకోలేకపోయింది. తనకే సొంతమనుకున్న భర్త.. మరో యువతికి ఆకర్షితుడవుతున్నాడన్న ఆలోచన తనను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. రోజురోజుకు పెరిగిపోతున్న అనుమానం.. మనసను క్షోభకు గురిచేసింది. ఈ సమస్యకు ఎలాగైన పరిష్కారం చెప్పాలనుకుంది. ప్రేమతో చెప్పి చూసినా.. బాధ్యతగా మందలించినా.. భయంతో బెదిరించినా.. భర్త ప్రేమ దూరమవుతుందనుకుందో ఏమో.. ఆ అమ్మాయి వైపు నుంచి నరుక్కురావాలని నిశ్చయించుకుంది. ఈ వ్యవహారంపై ఏప్రిల్‌ 24న గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్​లో ఫిర్యాదు కూడా చేసింది. అక్కడితో ఆగకుండా.. క్రూరంగా ఆలోచించి ఓ ఘోరమైన పథకాన్ని పన్నింది.

యువతిపై దాడి: ఈ నెల 26న పెట్టిన కేసును విత్‌డ్రా చేసుకుని.. దాని గురించి మాట్లాడాలంటూ బాధితురాలి కుటుంబ సభ్యులను ఇంటికి పిలిచింది. గాయత్రి మనసులో ఉన్న ప్లాన్​ తెలియక.. యువతితో సహా కుటుంబసభ్యులు ఇంటికి వెళ్లారు. ఇంటికి వచ్చిన వారితో మాట్లాడిన తర్వాత కాసేపటికి.. యువతిని గాయత్రి తన రూంలోకి తీసుకెళ్లింది. ముందుగా వేసిన పథకం ప్రకారం.. అప్పటికే ఇంట్లో ఉన్న నలుగురు యువకులతో యువతిపై దాడి చేయించింది. నోట్లో గుడ్డలు కుక్కి తీవ్రంగా హింసించిన యువకులు.. బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడ్డారు. ప్రైవేట్ భాగాల్లో పదునైన ఆయుధాలతో గాయపరిచారు. అక్కడితో ఆగకుండా.. ఈ ఘాతుకం మొత్తాన్ని గాయత్రి తన సెల్​ఫోన్​లో చిత్రీకరించింది.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఈ వీడియో మొత్తాన్ని సోషల్​మీడియాలో పెడతానని బాధితురాలిని గాయత్రి బెదిరించింది. తీవ్రంగా గాయపడిన యువతిని కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. చికిత్స పొందుతూనే బాధితురాలు జరిగిందంతా పోలీసులకు వివరించగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. గాయత్రితో పాటు నలుగురు యువకులను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details