తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్(Hyderabad) పంజాగుట్ట పీఎస్ పరిధిలోని ద్వారకాపురి కాలనీలో.. నాలుగేళ్ల బాలిక అనుమానాస్పద స్థితి(Suspicious death)లో మృతి చెందింది. ఓ దుకాణం ముందు పాప మృతదేహం పడి ఉండటంతో.. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలిక మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
Suspicious death: నాలుగేళ్ల బాలిక మృతి.. ప్రమాదమా? హత్యా?? - బాలిక మృతదేహం గుర్తింపు
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో దారుణం జరిగింది. పంజాగుట్ట పీఎస్ పరిధిలోని ఓ కాలనీలో బాలిక అనుమానాస్పద స్థితి(Suspicious death)లో మృతి చెందింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
![Suspicious death: నాలుగేళ్ల బాలిక మృతి.. ప్రమాదమా? హత్యా?? Suspicious death](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13546008-315-13546008-1636021368128.jpg)
Suspicious death
బాలిక ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు వెల్లడించారు. పాపకు సంబంధించిన తల్లిదండ్రులు, బంధువులు ఎవరూ రాలేదని పేర్కొన్నారు. బాలికది సాధారణ మరణమా..? లేక ఎక్కడైనా హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్‌లలో బాలిక తప్పిపోయిన కేసులేమైనా ఉన్నాయా అని పంజాగుట్టు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Boy died: పండుగ పూట విషాదం.. గుంతలో పడి మూడేళ్ల బాలుడు మృతి
Last Updated : Nov 4, 2021, 5:26 PM IST