అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్రతీరంలో విద్యార్థుల అన్వేషణ కొనసాగుతోంది. శుక్రవారం డైట్ కళాశాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు మొత్తం 12 మంది పరీక్షలు ముగిసిన తర్వాత విహారం కోసం పూడిమడక బీచ్‌కు వచ్చారు. 12 మందిలో ఒకరు ఒడ్డు మీద కూర్చుని ఉండగా.. 11 మంది సముద్రంలోకి స్నానానికి దిగారు. కాసేపటికి లోపలికి దిగిన విద్యార్థులపైకి ఓ రాకాసి అల వచ్చి పడింది. దీంతో వారు లోపలికి వెళ్లారు. కాసేపటికే ఐదుగురు తిరిగి తీరానికి కొట్టుకొచ్చారు. ఏడుగురు మాత్రం బయటికి రాలేకపోయారు. ఒడ్డు మీద ఉన్న విద్యార్థితో పాటు బయటికి వచ్చిన వారు పెద్దగా అరవడంతో దగ్గర్లో ఉన్న స్థానికులు ఇద్దరిని బయటికి తీసుకొచ్చారు.
Missing: సముద్ర తీరంలో ఏడుగురు విద్యార్థులు గల్లంతు.. ఒకరు మృతి - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
17:16 July 29
8 మంది విద్యార్థులు సురక్షితం
వారిలో నర్సీపట్నం మండలం పెద్దబొడ్డేపల్లికి చెందిన గుడివాడ పవన్ సూర్యకుమార్ ప్రాణాలు కోల్పోయాడు. మరో విద్యార్థిని అనకాపల్లి జిల్లా మునగపాకకు చెందిన సూరిశెట్టి తేజను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.గల్లంతైన వారిలో విశాఖ గోపాలపట్నానికి చెందిన కంపర జగదీష్, గుంటూరుకు చెందిన బయ్యపునేని సతీష్ కుమార్, అనకాపల్లి జిల్లా రోలుగుంటకు చెందిన జశ్వంత్‌కుమార్, ఇదే మండలం చూచుకొండకు చెందిన పెంటకోట గణేష్, ఎలమంచిలికి చెందిన పూడి రామచందు ఉన్నారు.
ఘటన జరిగిన వెంటనే స్థానికులు, మత్స్యకారులు గాలింపు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న కలెక్టర్, ఎస్పీ ఆ ప్రాంతానికి వచ్చి గాలింపును పర్యవేక్షించారు. మంత్రి అమర్నాథ్ కూడా సహాయచర్యలను పరిశీలించారు. విద్యార్థుల ఆచూకీ కోసం సాధ్యమైనంత మేర ప్రయత్నిస్తున్నామని ఎస్పీ తెలిపారు. చీకటి పడటం వల్ల సహాయచర్యలకు ఆటంకం కలిగిందన్న కలెక్టర్.. ఉదయం నుంచి నేవీ, మెరైన్ అధికారులతో పాటు స్థానిక మత్స్యకారుల సాయంతో మరింతగా గాలింపు చేపడతామన్నారు. గల్లంతైన సమాచారం తెలుసుకుని పూడిమడక వచ్చిన విద్యార్థుల కుటుంబ సభ్యులకు.. అభిజిత్ పరిశ్రమ అతిథి గృహంలో వసతి, భోజనం ఏర్పాటు చేశారు.
సముద్ర తీరంలో జరిగిన విషాద ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. విద్యార్థుల గల్లంతుపై సీఎం జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చదవండి: