Accidents: వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి - తాజా క్రైం వార్తలు
11:32 September 19
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం శివారులో రెండు ప్రమాదాలు జరిగాయి. ముత్యాలమ్మగూడెం వద్ద కారు కంటైనర్‌ను ఢీకొని చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ముత్యాలమ్మగూడెం వద్ద జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు మృతి మృతి చెందారు. ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి..