ACCIDENT AT SIDDIPETA : తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగదేవ్పూర్ మండలం మునిగడప శివారు మల్లన్న గుడి వద్ద ప్రమాదవశాత్తు ఓ కారు గుంతలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఘటనాస్థలంలో నలుగురు మృతి చెందగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో కారులో నుంచి మృతదేహాలను వెలికితీశారు.
దైవదర్శనానికి వెళ్లొస్తుండగా కాలువలో పడిన కారు.. ఐదుగురి దుర్మరణం - five died in a road accident in Siddipet district
ACCIDENT AT SIDDIPETA: తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునిగడప శివారులోని మల్లన్న గుడి వద్ద ఓ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు.
![దైవదర్శనానికి వెళ్లొస్తుండగా కాలువలో పడిన కారు.. ఐదుగురి దుర్మరణం ACCIDENT AT SIDDIPETA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17447910-758-17447910-1673351538841.jpg)
ACCIDENT AT SIDDIPETA
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కారును గుంతలో నుంచి బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చూడండి..
Last Updated : Jan 10, 2023, 9:21 PM IST