ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Murder: భాజపా నేత మల్లారెడ్డి హత్య కేసు.. ఐదుగురు నిందితులు అరెస్ట్​ - latest crime news in andhra pradesh

bjp leader: జగ్గయ్యపేటలో సంచలనం సృష్టించిన భాజపా నాయకుడు లంకెల మల్లారెడ్డి హత్యకు సంబంధించిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నందిగామ డిఎస్పీ నాగేశ్వర్​రెడ్డి తెలిపారు.

bjp leader murder
నిందితులు అరెస్ట్​

By

Published : Mar 2, 2022, 1:50 PM IST

bjp leader murder: కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో సంచలనం సృష్టించిన భాజపా నాయకుడు లంకెల మల్లారెడ్డి హత్య కేసులో పురోగతి లభించింది. ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నందిగామ డీఎస్పీ నాగేశ్వర్​రెడ్డి తెలిపారు.

అసలేం జరిగింది.....

గత నెల ఫిబ్రవరి 18న మల్లారెడ్డిని కారుతో ఢీకొట్టిన నిందితులు ఆ తర్వాత వేటకొడవళ్లతో నరికి చంపారని డీఎస్పీ తెలిపారు. హత్యపై ఫిబ్రవరి 19వ తేదీన కేసు నమోదు చేసి.. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పర్యవేక్షణలో నేర పరిశోధన చేసినట్లు వివరించారు.

మల్లారెడ్డి స్వగ్రామం వత్సవాయి మండలం చిట్యాల. అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను వియ్యంకుడు మారెళ్ళ పుల్లారెడ్డితో మల్లారెడ్డికి వ్యక్తిగత కక్షలు ఉన్నాయని తెలిపారు. పుల్లారెడ్డిని చంపేస్తారనే అనుమానంతో ఆయన అనుచరులు మల్లారెడ్డి హత్యకు పథక రచన చేసినట్లు చెప్పారు. పుల్లారెడ్డి సోదరుడు సూరారెడ్డి దీని వెనుకుండి నడిపించారని వివరించారు. 14 లక్షల సుపారీతో గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన కిరాయి హంతకులతో మల్లారెడ్డి హత్య చేయించినట్లు వెల్లడించారు. హత్యకు వారం ముందునుంచే మల్లారెడ్డిని వెంబడించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి:

AP CRIME NEWS: దిండుతో భార్యను హతమార్చిన భర్త.. కారణమిదే..

ABOUT THE AUTHOR

...view details