హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. గోల్డ్‌షాపు యజమానిని బెదిరించి బంగారం చోరీ - Run away with the gold
హైదరాబాద్‌లోని నాగోల్ స్నేహపురి కాలనీలో కాల్పుల కలకలం రేగింది. బంగారం షాపు యజమానిపై కాల్పులు జరిపిన దుండగులు.. బంగారంతో ఉడాయించారు. కాల్పుల్లో గాయపడిన యజమానిని ఆస్పత్రికి తరలించారు.
![హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. గోల్డ్‌షాపు యజమానిని బెదిరించి బంగారం చోరీ firing](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17087677-141-17087677-1669913404073.jpg)
firing
హైదరాబాద్ నగరంలోని నాగోల్ స్నేహపురి కాలనీలో కాల్పులు కలకలం రేపాయి. నాగోల్‌లోని మహదేవ్ జువెల్లర్స్‌లోకి ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ఒక్కసారిగా దుకాణంలోని యజమానిపై కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో దుకాణ యజమానికి, వర్కర్‌కు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం దుండగులు యజమానిని బెదిరించి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. గాయపడిన దుకాణ యజమాని కల్యాణ్, వర్కర్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి.. నిందితులను కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం
Last Updated : Dec 1, 2022, 10:53 PM IST