ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Fires in Bus: ప్రైవేట్ బస్సులో మంటలు.. తప్పిన ప్రాణనష్టం - bus fire in Hyderabad

Fires in Bus: హైదరాబాద్ బహదూర్​పురా పరిధిలో గ్యారేజీలో ఉన్న ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పారు. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

bus fire in Hyderabad
ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు..

By

Published : Apr 14, 2022, 3:46 PM IST

Fires in Bus: హైదరాబాద్ బహదూర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్ఆలం పీఎస్‌ పరిధిలో ప్రైవేటు బస్సులో మంటలు వ్యాపించాయి. ఓ గ్యారేజ్‌లోని బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పారు. ఘటనా సమయంలో అక్కడా ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు..

ABOUT THE AUTHOR

...view details