ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Fire Accidents: రాష్ట్రంలో పలుచోట్ల అగ్నిప్రమాదాలు.. భారీగా ఆస్తి నష్టం - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

Fire Accidents: రాష్ట్రంలో వేర్వేరు చోట్ల అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కడపలోని హనుమప్ప వీధిలో ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్న గోదాంలో మంటలు చెలరేగి... సామగ్రి అంతా అగ్నికి ఆహుతికాగా, కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం రామానగరంలో... గ్యాస్ సిలిండర్లు పేలి బట్టల షాపు పూర్తిగా దగ్ధమైంది.

fire accidents
రాష్ట్రంలో పలుచోట్ల అగ్నిప్రమాదాలు

By

Published : May 9, 2022, 12:28 PM IST

వైఎస్సార్ జిల్లా: జిల్లాలోని హనుమప్ప వీధిలో ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్న గోదాంలో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 3.50 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.

*మరో ఘటనలో నగర శివారులోని విశ్వనాథపురం వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా కారులో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది.

రాష్ట్రంలో పలుచోట్ల అగ్నిప్రమాదాలు

కృష్ణా జిల్లా: చల్లపల్లి మండలం రామానగరంలో.. గ్యాస్ సిలిండర్లు పేలి దుస్తుల షాపు పూర్తిగా దగ్ధమైంది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా షాపులో మంటలు చెలరేగి... అక్కడే ఉన్న గ్యాస్‌ సిలిండర్లు పేలిపోయాయి. దుకాణంలో ఉన్న కుట్టుమిషన్లు, దుస్తులు మొత్తం కాలిబూడిదయ్యాయని.. యజమానురాలు వాపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 3లక్షలు నష్టపోయినట్లు బాధితురాలు తెలిపింది.

గుంటూరు జిల్లా: మొక్కజొన్న పంటకు నిప్పంటుకొని భారీగా నష్టం వాటిల్లిన ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో జరిగింది. తెనాలి మండలం పెనుగుదురులపాడు సమీపంలో కొందరు.. మొక్కజొన్న వ్యర్థాలకు నిప్పంటించారు. సాయంత్రం పెనుగాలుల బీభత్సానికి.. ఆ మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇవీ చదవండి: Cyclone Asani: తీవ్రంగా మారిన 'అసని'.. కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు

ABOUT THE AUTHOR

...view details