ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Fire accident: వీరపనేనిగూడెంలోని ప్లాస్టిక్ కర్మాగారంలో అగ్నిప్రమాదం - fire accident in krishna district

fire-accident-in-unguturu-krishna-district
పెదఅవుటపల్లిలో టవల్స్ తయారీ కంపెనీలో అగ్నిప్రమాదం

By

Published : Sep 3, 2021, 7:10 AM IST

Updated : Sep 3, 2021, 8:36 AM IST

07:08 September 03

రెండు అగ్నిమాపక వాహనాలతో మంటలార్పుతున్న సిబ్బంది

పెదఅవుటపల్లిలో టవల్స్ తయారీ కంపెనీలో అగ్నిప్రమాదం

         కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో అగ్నిప్రమాదం జరిగింది. తెంపల్లి వద్ద గల టవల్స్ కంపెనీలో వేకువజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో నిండిపోయాయి. స్థానిక ప్రజలంతా ఏమవుతుందో తెలియక విపరీతంగా భయపడిపోయారు. ప్రమాద విషయం గుర్తించిన స్థానికులు, కంపెనీ యజమానికి, పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. 

        హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది... రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలార్పుతున్నారు. ప్రమాద సమయంలో కార్మికులెవరూ లోపల లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది. ఈ కంపెనీలో ప్లాస్టిక్ బ్యాగులతో పాటు టవల్స్​ను తయారు చేస్తారు. అవన్నీ కాలి బూడిదైపోయాయి. కోట్లలో ఆస్తినష్టం జరిగిందని యజమాని చెబుతున్నాడు. ప్రమాదం వాటిల్లడానికి గల కారణాలపై ఆత్కూరు ఎస్‌.ఐ. శ్రీనివాస్ ఆరా తీస్తున్నారు. 

ఇదీ చూడండి:pension problems in ap: ఇంట్లో రెండు పింఛన్లుంటే.. ఒక్కరికే!

Last Updated : Sep 3, 2021, 8:36 AM IST

ABOUT THE AUTHOR

...view details