Fire Accident: ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో పార్కింగ్ చేసిన ప్రైవేటు బస్సులకు మంటలు అంటుకుని భారీ ఎత్తున చెలరేగాయి. ఈ ఘటనలో 8 బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. వీటి పక్కనే మరో 20 బస్సుల వరకు ఉన్నాయి. ఈ బస్సులన్నీ తమవేనని కావేరి ట్రావెల్స్ యజమాని వెంకటేశ్వర్లు తెలిపారు. కొవిడ్ కారణంగా డిమాండ్ తగ్గడంతో బస్సులన్నీ ఉడ్ కాంప్లెక్స్ ప్రాంతంలో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదం కారణంగా రూ. 8 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు.
Fire Accident: ఒంగోలు ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం... 8 ప్రైవేటు బస్సులు దగ్ధం - కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు దగ్ధం
![Fire Accident: ఒంగోలు ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం... 8 ప్రైవేటు బస్సులు దగ్ధం ongole fire accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14601197-230-14601197-1646111137695.jpg)
ongole fire accident
10:24 March 01
కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు దగ్ధం
ఒంగోలు ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో మంటలు... 8 ప్రైవేటు బస్సులు దగ్ధం
ఏసీ బస్సులు కావడంతో కంప్రెసర్లు, టైర్లు పేలి చట్టుప్రక్కల వారిని భయబ్రాంతులకు గురి చేసింది. ఒంగోలు, టంగుటూరు, అద్దంకి ప్రాంతాల నుంచి ఆరు అగ్నిమాపక శకటాలను రప్పించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మంటలు చెలరేగడానికి కారణమేంటో తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:
Mother suicide with children : ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
Last Updated : Mar 1, 2022, 12:33 PM IST