కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రమాదవశాత్తు పురపాలక కార్యాలయానికి చెందిన చెత్త లారీ దగ్ధం అయ్యింది. పట్టణ శివారు బైపాస్ రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. చెత్త తరలించే లారీలో బ్యాటరీ కాలిపోవడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయని లారీ డ్రైవర్ చెబుతున్నారు. వెంటనే కిందకు దిగి అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చినట్లు తెలిపారు. వారు సకాలంలో వచ్చి మంటలార్పడంతో భారీ ప్రమాదం తప్పిందని వివరించారు.
FIRE ACCIDENT IN LORRY: ఆదోనిలో చెత్త లారీ దగ్ధం... కారణం ఏంటంటే..! - మంటల్లో కాలిపోయిన లారీ
కర్నూలు జిల్లా ఆదోనిలో పరపాలక కార్యాలయానికి చెందిన ఓ లారీ బ్యాటరీ కాలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడటంతో లారీ ముందు భాగం పూర్తిగా కాలిపోయింది.
ఆదోనిలో దగ్ధమైన చెత్త లారీ.. కారణం అదేనా..?