తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో ఓ కాంక్రీట్ మిక్సర్ వాహనం దగ్ధమైంది. మానకొండూర్ నుంచి లింగాపూర్ వెళ్తున్న కాంక్రీట్ మిక్సర్లో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్ భయాందోళనకు గురై కిందకి దూకాడు. మంటల నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. మంటలు ఆర్పేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం వల్ల వాహనం పూర్తిగా కాలిపోయింది. స్థానికులు ఈ ఘటనను చరవాణుల్లో చిత్రీకరించారు.
తెలంగాణ: విద్యుదాఘాతంతో కాంక్రీట్ మిక్సర్ దగ్ధం - తెలంగాణ వార్తలు
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో కాంక్రీట్ మిక్సర్ వాహనం పూర్తిగా దగ్ధమైంది. విద్యుదాఘాతంతో వాహనంలో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

విద్యుదాఘాతంతో కాంక్రీట్ మిక్సర్ దగ్ధం
విద్యుదాఘాతంతో కాంక్రీట్ మిక్సర్ దగ్ధం