నెల్లూరు జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్ కూడలిలోని ఓ కోళ్ల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు గ్యాస్ బండ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించి, వెంటనే అప్రమత్తమైన దుకాణ యజమాని ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.
FIRE ACCIDENT: చికెన్ షాపులో అగ్నిప్రమాదం.. వందలాది కోళ్లు మృతి - nellore latest fire accident
నెల్లూరు జిల్లా వెంకటగిరి రోడ్ కూడలిలోని ఓ కోళ్ల దుకాణంలో గ్యాస్ బండ లీకై అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మనుషులకు ఎటువంటి ప్రమాదమూ జరగకపోయినప్పటికీ.. వందలాది కోళ్లు చనిపోయాయి.
కోళ్ల దుకాణంలో అగ్నిప్రమాదం.. ప్రాణాలు కోల్పోయిన వందలాది జీవాలు
కానీ.. కోళ్లు మాత్రం పెద్ద సంఖ్యలో చనిపోయాయి. వందలాది కోళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఒక్కసారిగా ఉవ్వెత్తున మంటలు చెలరేగే సరికి.. స్థానిక ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేశారు.
ఇదీ చూడండి:TIRUMALA HUNDI INCOME: తిరుమల శ్రీనివాసుడి హుండీ ఆదాయం ఎంతంటే?