Fire Accident in Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాగ్‌లింగంపల్లి వీఎస్టీ సమీపంలోని గోదాములో అగ్ని ప్రమాదం సంభవించి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్ సామగ్రి మంటల్లో కాలి బూడిదయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన గోదాము పరిసర ప్రాంతాల్లో బస్తీలు ఉండడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు - Bagh Lingampally latest news
Fire Accident in Hyderabad: తెలంగాణలోని హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సికింద్రాబాద్ ఘటన మరువకముందే.. బాగ్‌లింగంపల్లిలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది.
Fire Accident in Hyderabad