fire accident: విజయవాడ బీసెంట్ రోడ్డులోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఏపీ కో-ఆపరేటివ్ ట్రైబ్యునల్‌లోని నాలుగవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో నుంచి మంటలు చేలరేగాయి. ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని రెండు ఫ్లోర్లలో ఉన్న కోర్టులకు మంటలు అంటుకున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అదే కాంప్లెక్స్‌లో బ్యాంక్‌తోపాటు మరికొన్ని కార్యాలయాలు ఉన్నాయి.