Fire Accident at Tirupati: తిరుపతిలోని కరకంబాడి మార్గంలో గల ఉపాధ్యాయనగర్‌లో... ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. లక్షల్లో ఆస్తి నష్టం సంభవించింది. ఉపాధ్యాయనగర్‌లో గల ఖాళీస్థలంలో ఉన్న అండర్ డ్రైనేజీ ప్లాస్టిక్ పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న రెండంతస్తుల భవనానికి మంటలు వ్యాపించాయి.
తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం... లక్షల్లో ఆస్తి నష్టం - AP News
Fire Accident at Tirupati: తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉపాధ్యాయనగర్‌లోని ఖాళీస్థలంలో ఉన్న... ప్లాస్టిక్ పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న రెండంతస్తుల భవనానికి మంటలు వ్యాపించాయి. భవనంలో ఉన్న కుటుంబాలు అప్రమత్తమై... బయటకు రావడంతో ప్రాణానష్టం తప్పింది.
Fire Accident at Tirupati
భవనంలో ఉన్న కుటుంబాలు బయటకు రావడంతో ప్రాణానష్టం తప్పింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న తిరుపతి ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. రాత్రి కావడం.. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో పరిసరాల్లోని జనం భయబ్రాంతులకు గురయ్యారు.
ఇదీ చదవండి:వివస్త్రను చేసి.. స్తంభానికి కట్టేసి.. మహిళపై విచక్షణారహిత దాడి!