తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకనగర్ బస్తీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దుర్గా కన్వెన్షన్‌కు ఎదురుగా ఉన్న పరుపుల గోదాంలో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. పరుపులు తయారు చేయటానికి వినియోగించే మెటీరియల్ ఎక్కువగా ఉండటంతో మంటలు చాలా వ్యాపించాయి.
Fire Accident in HYD: మైలార్దేవ్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం... ఆస్తినష్టం ఎంతంటే? - రంగారెడ్డి జిల్లా వార్తలు
మైలర్‌దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకనగర్ బస్తీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుర్గా కన్వెన్షన్‌కు ఎదురుగా ఉన్న పరుపుల గోదాంలో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక శాఖ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
Fire Accident in HYD:
స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించటంతో... రెండు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. ఈ ప్రమాదంలో రూ. 7 లక్షల వరకు ఆస్తినష్టం వరకు జరిగిందని నిర్వాహకుడు తెలిపారు. విద్యుత్ఘాతం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:రూ. 75 కోట్లు.. లెక్కల్లో చూపలేదు!