అనంతపురం జిల్లా కదిరిలోని పరుపుల గోదాంలో విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నికీలలు ఎగిసిపడటం గమనించిన స్థానికులు.. వెంటనే యజమానికి సమాచారమిచ్చారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఫలితం దక్కలేదు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని.. యజమాని వాపోయాడు. ప్రమాదంలో రూ.5 లక్షల మేర నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
గోదాంలో అగ్ని ప్రమాదం.. రూ.5లక్షల మేర నష్టం! - అనంతపురం జిల్లా గోదాంలో అగ్ని ప్రమాదం
అనంతపురం జిల్లా పరుపుల గోదాంలో విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Fire Accident