కొనుగోలుదారుడి అత్యుత్సాహం.. టపాకాయలు పేల్చి చూశాడు, ఆ తరువాత .. - బాణాసంచా దుకాణాలలో అగ్నిప్రమాదం
06:11 October 23
భయాందోళనతో పరుగులు తీసిన స్థానికులు
FIRE ACCIDENT AT CRACKERS SHOP : కొనుగోలుదారుడి అత్యుత్సాహం .. బాణాసంచా దుకాణదారుల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. కొనుక్కున్న టపాకాయల నాణ్యతను పరిశీలించేందుకు.. దుకాణం సమీపంలోనే వెలిగించాడు. దీంతో ఆ బాణసంచా పేలుడికి నిప్పురవ్వలు చుట్టుపక్కల ఉన్న దుకాణాల్లోకి ఎగిసిపడి.. షాపులకు మంటలు అంటుకున్నాయి . అప్రమత్తమైన దుకాణదారులు షాపుల నుంచి బయటకు రావడంతో.. పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన తిరుపతి జిల్లాలోని వడవలపేట మండలంలోని నారాయణదాసు తోటలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 20 లక్షల రూపాయల మేర ఆస్తినష్టం జరిగిందని బాధితులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: