హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మాన్‌ఘాట్ కెనరా బ్యాంక్‌లో పెను ప్రమాదం తప్పింది. విద్యుదాఘాతంతో చెలరేగిన మంటలను.. స్థానికులు గమనించటంతో ముప్పు తప్పింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్రమత్తమైన సిబ్బంది మంటలను(FIRE ACCIDENT) అదుపులోకి తెచ్చారు. అప్పటికే బ్యాంకులోని పలు విద్యుత్ ఉపకరణాలు, సామగ్రి మంటల్లో కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ సంభవించిన తీరుపై సాంకేతిక సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: