ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

న్యాయవాదుల హత్య కేసు... ఎఫ్‌ఐఆర్​లో ఆ ముగ్గురి పేర్లు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాదుల హత్యపై ఎఫ్​ఐఆర్​ నమోదైంది. మృతుడు వామన్​రావు తండ్రి కిషన్​రావు ఫిర్యాదుతో ముగ్గురిపై కుట్ర, హత్య అభియోగాల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

fir registered on murder of telangana high court lawyers
న్యాయవాదుల హత్య కేసు... ఎఫ్‌ఐఆర్​లో ఆ ముగ్గురి పేర్లు

By

Published : Feb 18, 2021, 6:08 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాదుల హత్యపై ఎఫ్​ఐఆర్​ నమోదైంది. మృతుడు వామన్​రావు తండ్రి కిషన్​రావు ఫిర్యాదుతో ముగ్గురిపై కుట్ర, హత్య అభియోగాల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వామన్​రావు దంపతుల హత్య కేసులో పోలీసులు.. ఏ1 గా వెల్ది వసంతరావు, ఏ2గా కుంట శ్రీనివాస్, ఏ3గా అక్కపాక కుమార్​ను చేర్చారు. ఐపీసీ 120బి, 302, 341, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద బుధవారం రోజు వామన్​రావు దంపతులను గుర్తుతెలియని దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి కల్వచర్ల చేరుకున్న క్లూస్ టీం వివరాలు సేకరించింది.రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాదుల హత్యపై ఎఫ్​ఐఆర్​ నమోదైంది. మృతుడు వామన్​రావు తండ్రి కిషన్​రావు ఫిర్యాదుతో ముగ్గురిపై కుట్ర, హత్య అభియోగాల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details