Case On Bellamkonda: సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన కొడుకు హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై తెలంగాణలోని బంజారాహిల్స్ సీసీఎస్‌లో కేసు నమోదైంది. బెల్లంకొండ సురేష్, శ్రీనివాస్ తన దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వటం లేదని శ్రవణ్‌కుమార్ అనే వ్యాపారి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు ఇరువురిపై కేసు నమోదు చేశారు.
2018లో డైరెక్టర్ మలినేని గోపిచంద్ దర్శకత్వంలో తీస్తున్న సినిమాకు డబ్బులు అవసరముందని దాదాపు రూ.85 లక్షలు తీసుకున్నారని శ్రవణ్ తెలిపారు. తీసుకున్న డబ్బులు అప్పటి నుంచి తిరిగి ఇవ్వలేదన్నాడు. ఇవ్వమని అడిగితే.. ఆ సినిమాకు సహనిర్మాతగా లాభాల్లో వాటా కల్పిస్తామని నమ్మబలికారన్నారు. ఇప్పటికీ ఆ సినిమా తెరకెక్కకపోవటం.. డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవటం వల్ల నాంపల్లి కోర్టులో శ్రవణ్ దావా వేశాడు. బాధితుని పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు.. బెల్లంకొండ సురేష్, శ్రీనివాస్‌పై కేసు నమోదు చేయాలని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలమ మేరకు.. పలు సెక్షన్ల కింద ఇరువురిపై కేసు నమోదు చేశారు.