ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Heroine Charmikour: డ్రగ్స్ కేసు విచారణ.. ఈడీ ముందుకు సినీనటి చార్మికౌర్ - cine actors in drugs case

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు విచారణలో సరఫరాదారు కెల్విన్‌ సమాచారం ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో మొదటిరోజు పూరీ జగన్నాథ్​ విచారణకు హాజరయ్యారు. ఈడీ అడిగిన 3 బ్యాంకుల లావాదేవీలకు సంబంధించిన సమాచారం అందజేశారు. రేపు హైదరాబాద్​లో ఈడీ ముందు సినీనటి చార్మికౌర్ హాజరుకానున్నారు.

Film Actress Charmikour is front in the drug case trial
డ్రగ్స్ కేసు విచారణలో ఈడీ ముందుకు సినీనటి చార్మికౌర్

By

Published : Sep 1, 2021, 6:12 PM IST

టాలీవుడ్​లో డ్రగ్స్ కేసు విచారణలో కీలక సరఫరాదారు కెల్విన్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. కెల్విన్‌ నుంచి బ్యాంకు లావాదేవీలను ఈడీ అధికారులు సేకరించారు. కెల్విన్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా నిన్న పూరి జగన్నాథ్‌ను 10 గంటలపాటు విచారించారు. అతడి నుంచి 3 బ్యాంకు ఖాతాల లావాదేవీల సమాచారం సేకరించారు. కెల్విన్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా పూరీని ప్రశ్నించిన అధికారులు.. అతనికి సంబంధించిన మూడేళ్ల లావాదేవీలు సేకరించారు. 2017నాటి బ్యాంకు లావాదేవీలపైనా దృష్టి సారించారు.

అనుమానాస్పద లావాదేవీల ఆధారంగా..

కెల్విన్, ఇద్దరు అనుచరుల ఫోన్లలో గతంలో లభించిన తారల వివరాల ఆధారంగానే నటులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. 8మంది సరఫరాదారుల బ్యాంకు ఖాతాలు సేకరించిన అధికారులు.. అనుమానాస్పద లావాదేవీల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.

2017లో నమోదైన కేసుల ఆధారంగా పలు కీలక విషయాలపై ఈడీ అధికారులు ఆయన్ను ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ విచారణ ఎక్సైజ్ సిట్ విచారణకు భిన్నంగా కొనసాగనుంది. మనీలాండరింగ్‌ కోణంలోనే వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ సిట్ నుండి వివరాలు సేకరించిన ఈడీ.. సినీ రంగానికి చెందిన 12 మంది బ్యాంక్ ఖాతాలు పరిశీలించే అవకాశం ఉంది.

ఒకరి తర్వాత ఒకరు

ఈ వ్యవహారంలో సెప్టెంబర్ 2వ తేదీన చార్మి, 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్‌తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22వ తేదీ తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఎక్సైజ్‌ అధికారులకు చిక్కిన కొందరు డ్రగ్స్‌ విక్రేతల విచారణలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సినీ ప్రముఖులను ఎక్సైజ్‌ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. రక్తం, గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపించారు. అయితే, సినీ ప్రముఖులకు క్లీన్‌చీట్‌ ఇచ్చిన ఎక్సైజ్‌ అధికారులు.. పలువురు డ్రగ్స్‌ విక్రేతలపై 12 ఛార్జిషీట్లు దాఖలు చేశారు.

ఇదీ జరిగింది..

డ్రగ్స్‌ కేసును సీబీఐ, నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని గతంలో తెలంగాణలోని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఆ రాష్ట్ర హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఈడీ.. కేసు విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎక్సైజ్‌ అధికారుల నుంచి వివరాలు అందడం లేదని ఆరోపించింది. చివరకు తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ కేసుల ఆధారంగా డ్రగ్స్‌ కేసులపై మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. డ్రగ్స్‌ కేసులో విచారణకు హాజరుకావాలని పలువురు సినీ ప్రముఖులకు సమన్లు జారీ చేసింది.

ఇదీ చూడండి:DRUGS CASE: కొనసాగుతోన్న పూరీ విచారణ.. ఈడీ కార్యాలయానికి బండ్ల గణేశ్​..!

ABOUT THE AUTHOR

...view details