ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Suicide attempt: మహిళా జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం - suicide attempt case issue

సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర వ్యాఖ్యానాలతో వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆవేదనతో.. ఓ మహిళా జర్నలిస్టు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తెలంగాణలోని హైదరాబాద్‌ డబీర్‌పురాకు చెందిన ఎంబీటీ నేత సయ్యద్‌ సలీం (66).. తనను వేధిస్తున్నట్లు ఆమె ఓ సెల్ఫీ వీడియో తీసి, నిద్రమాత్రలు మింగారు.

suicide attempt
ఆత్మహత్యాయత్నం

By

Published : Jun 14, 2021, 9:37 AM IST

తెలంగాణలోని హైదరాబాద్ గుల్షన్‌ - ఎ - ఇక్బాల్‌ కాలనీకి చెందిన సయ్యదా నాహీదా ఖాద్రీ (37) ఓ న్యూస్‌ ఛానల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఎంబీటీ నేత సలీం కొద్దిరోజులుగా ఆమెపై అసభ్యకర వీడియోలు, చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.

మానసిక ఒత్తిడికి గురైన ఖాద్రీ శనివారం రాత్రి ఇంట్లో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి వెళ్లగా కుటుంబ సభ్యులు ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. తన తల్లి పరిస్థితికి సలీం కారణమని నాహీదా కూతురు శనివారం అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ రుద్రభాస్కర్‌ ఆదేశాల మేరకు డీఐ కె.ఎన్‌.ప్రసాద్‌వర్మ కేసు నమోదు చేసి, సలీంను అరెస్టు చేశారు. అతణ్ని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలియడంతో వందల సంఖ్యలో మజ్లిస్‌ కార్యకర్తలు ఠాణా వద్దకు వచ్చి ఆయనపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

వేధింపుల విషయమై నాహీదా ఖాద్రీ మే 25న సైబర్‌ క్రైం పోలీసులు, సీపీ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం సలీం ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టి ఆమెను దూషించారు. తీవ్ర వేదనకు గురైన నాహీదా.. ‘సయ్యద్‌ సలీం వ్యాఖ్యలతో నా కుటుంబం మానసిక క్షోభకు గురైంది. పెళ్లి కావాల్సిన కూతుళ్లున్నారు. 20 రోజులుగా నరకయాతన అనుభవిస్తున్నా.. నాకు ఆత్మహత్య తప్ప మరో దారి లేదు’’ అంటూ సెల్ఫీ వీడియోలో రోదించారు.

ఇదీ చదవండి:

suicide: నవ వధువు ఆత్మహత్య.. ఆరోగ్య సమస్యలే కారణమా?

ABOUT THE AUTHOR

...view details