ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

డెంగీతో తండ్రి, కుమారుడు మృతి - ap latest crime news

father-and-son-die-of-dengue-at-prakasham-district
డెంగీతో తండ్రి, కుమారుడు మృతి

By

Published : Sep 29, 2021, 10:02 AM IST

Updated : Sep 29, 2021, 11:03 AM IST

10:00 September 29

తండ్రి మరణించిన కొన్నిగంటల్లోనే కుమారుడు మృతి

         గుంటూరు జిల్లా కేంద్రంలో డెంగీ కారణంగా కొన్ని గంటల వ్యవధిలోనే తండ్రీ కుమారులు మృతి చెందారు. జిల్లాలోని వేమూరు మండలం బలిజపాలేనికి చెందిన రవికుమార్(55) ఆయన కుమారుడు రవితేజ(24)లకు ఇటీవలే డెంగీ సోకింది. కుటుంబ సభ్యులు వీరిద్దరిని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించారు. చికిత్స పొందుతూ... ఈరోజు ముందుగా తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత కొన్ని గంటలకే కుమారుడు కూడా మృతి చెందాడు. 

        విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రవికుమార్ ప్రకాశం జిల్లాలోని వేటపాలెం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్​గా పనిచేస్తున్నారు. 

ఇదీ చూడండి:RAINS: తగ్గని వరద ఉద్ధృతి..గులాబ్‌ ధాటికి అన్నదాతకు కష్టాలు

Last Updated : Sep 29, 2021, 11:03 AM IST

ABOUT THE AUTHOR

...view details