ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న సిబ్బంది - MAN SUICIDE ATTEMPT IN TIRUPATI

MAN SUICIDE ATTEMPT: రికార్డులు అన్ని కరెక్టుగా ఉన్నా.. ఆన్​లైన్​లో తన పేరును మార్చి.. ప్రభుత్వ భూమిగా మార్చారని ఓ రైతు తహశీల్దార్​ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన సిబ్బంది రైతును అడ్డుకున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది.

MAN SUICIDE ATTEMPT AT MRO OFFICE
MAN SUICIDE ATTEMPT AT MRO OFFICE

By

Published : Oct 15, 2022, 4:18 PM IST

MAN SUICIDE ATTEMPT AT MRO OFFICE : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్మ చేసుకోవడానికి ప్రయత్నించాడు. పిచ్చినాయుడిపల్లి గ్రామానికి చెందిన వాసు అనే రైతు.. రెవెన్యూ అధికారులు గత కొన్ని సంవత్సరాలుగా తనకు అన్యాయం చేస్తున్నారని ఒంటిపై పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. రికార్డు పరంగా అన్నీ కరెక్టుగా ఉన్నా.. తనకు తెలియకుండా ఆన్​లైన్​లో పేరును తొలగించి ప్రభుత్వ భూమిగా సృష్టించి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

గ్రామానికి చెందిన అధికార పార్టీ సర్పంచ్ భాస్కర్ మాటలు విని తనకు అన్యాయం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేసేంతవరకు ఎమ్మార్వో కార్యాలయం నుంచి కదిలేది లేదంటూ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. ఎమ్మార్వో వారికి వివరణ ఇస్తూ.. రికార్డులు పరంగా ఎలా ఉంటే అలా చేస్తామని.. అంతేకాని మీరు తెచ్చిన రికార్డుల ప్రకారం చేయాలంటూ బలవంతం చేయడం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన బాధితులు తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. రెవెన్యూ సిబ్బంది గమనించి బాధితుడిని అడ్డుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details