ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ఆటోడ్రైవర్‌ను నిండా ముంచిన పిన్‌ నంబరు - cyber crime news

1 2 3 4... ఈ నంబరుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుంచుకోవడానికి సులువుగా ఉంటుందని చాలా మంది ఇలాంటి నంబర్లనే పిన్ నంబర్లుగా పెట్టుకుంటారు. అలా అనుకునే ఓ వ్యక్తి తన బ్యాంకు ఖాతాలకు ఈ నంబర్ పెట్టుకున్నాడు. అదే అతని కొంప ముంచి అప్పుల పాలు చేసింది. తన బ్యాంకు ఖాతాలో ఉన్న లక్షా 33 వేలను ఖాళీ చేసింది. అసలు ఈ 1234 ఏంటి అనుకుంటున్నారా? అయితే తెలంగాణలోని కూకట్ పల్లికి చెందిన ఓ ఆటో డ్రైవర్ కథ చదవాల్సిందే.

Fancy PIN number immersed in autodriver
నిండా ముంచిన పిన్‌ నంబరు

By

Published : Aug 23, 2021, 12:50 PM IST

గుర్తుంచుకోవడానికి సులువుగా ఉంటుందని.. ఫ్యాన్సీ నంబరు అని ఓ ఆటోడ్రైవర్ 1234ను తన పిన్‌ నంబర్​గా పెట్టుకున్నాడు. అదే అతని కొంపముంచింది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని కూకట్‌పల్లి ఏవీబీపురంలో నివసించే రాము ట్రాలీ ఆటో నడుపుతుంటాడు. ఈనెల 13న మార్కెట్‌కు వెళ్లినప్పుడు చరవాణి చోరీ కావడంతో కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానంతో తన ఖాతాను తనిఖీ చేశాడు. రూ.1.33 లక్షలు మాయం కావడంతో పోలీసులకు తెలియజేశాడు.

ఆటోపై ఉన్న అప్పు తీర్చేందుకు చిట్టీ పాడిన డబ్బును ఎస్‌బీఐ ఖాతాలో వేయగా ఆ సొమ్మంతా మాయమైపోయింది. తన చరవాణిలో పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకున్న అతను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేశాడు. అన్నింటికీ యూపీఐ పిన్‌ 1234 పెట్టాడు. అతని చరవాణి చోరీ చేసిన నిందితుడు 1234 పెట్టి ఉంటాడని ఊహించి ఎంటర్ చేశాడు. అది సరిగ్గా పని చేసి యాప్ ఓపెన్ అయ్యింది.

వెంటనే జ్యుయలరీ షాపులో బంగారం, డీమార్ట్‌లో షాపింగ్‌ చేశాడు. బ్యాంకు స్టేట్‌మెంట్‌లో ఈ వివరాలు తెలిశాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు డీమార్ట్‌, జ్యుయలరీ షాపుల్లో సీసీటీవీ ఫుటేజ్‌ కోసం పరిశీలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. యూపీఐ పిన్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన చాటిచెప్పింది.

ఇదీ చూడండి:

Accident: కొద్ది రోజుల్లో కల్యాణం.. అంతలోనే వరుడు మృతి!

ABOUT THE AUTHOR

...view details