ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం.. తల్లి, కుమార్తె మృతి - శ్రీకాకుళం జిల్లా యలమంచిలిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం

09:04 May 05
ఒంటిపై పెట్రోల్ పోసుకున్న తల్లి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు
Suicide Attempt: శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం యలమంచిలిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు (తల్లి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు) ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ప్రమాదంలో తల్లి చిన్నమ్మడు(46), కుమార్తె జాహ్నవి(17) మృతి చెందగా.. మరో కుమార్తె రజని(20), కుమారుడు వెంకటసాయి శశాంకర్(14)కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న నరసన్నపేట సీఐ తిరుపతి రావు దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి:పోలవరం భూసేకరణలో భారీ అక్రమాలు.. లబోదిబోమంటున్న బాధితులు