అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం - ఏపీ నేర వార్తలు
15:35 August 17
గుంటూరు జిల్లా తెనాలిలో ఘటన
SUICIDE ATTEMPT: అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన పి.వసుంధరతో పాటు ఆమె కుమారుడు కిరణ్, కోడలు యామిని పురుగుల మందు తాగారు. ఇది గమనించిన స్థానికులు వారిని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తెనాలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భర్తకు తెలియకుండా వసుంధర 20 లక్షల మేర అప్పులు చేశారని.. తిరిగి చెల్లించాలని ఒత్తిళ్లు వస్తుండటంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం.
ఇవీ చదవండి: