Choppadandi Family Suicide: తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మండలం కాట్నపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఓ కుటుంబం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఉరి వేసుకుని దంపతులు, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
మృతులు బైరి శంకరయ్య(55), జమున(50), శ్రీధర్(25)లుగా గుర్తించారు. మూడు నెలల క్రితం శంకరయ్య కుమార్తె వివాహం చేశారు. దీంతో అప్పులు పెరిగాయి. ఎలా తీర్చాలో తెలియక.. అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు.