ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

FARMER SUICIDE: అప్పుల బాధ తాళలేక కౌలురైతు ఆత్మహత్య - ఏపీలో కౌలురైతు ఆత్మహత్య

భూమి లేకపోవడంతో.. ఏడెకరాల పొలం కౌలుకు తీసుకున్నాడు. అప్పులు తీసుకొచ్చి పంటసాగు చేశాడు. దురదృష్టవశాత్తు పంట దిగుబడి సరిగ్గారాక, అప్పులు పెరిగిపోవడంతో.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

FAMER COMMITS SUICIDE IN GUNTUR DISTRICT
అప్పుల బాధ తాళలేక కౌలురైతు ఆత్మహత్య

By

Published : Oct 30, 2021, 9:01 AM IST

గుంటూరు జిల్లా చేబ్రోలులో అప్పుల బాధ భరించలేక ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన బాలకోటయ్య(50) పంట చేలోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇతను కొంతకాలంగా నారాకోడూరు గ్రామంలో ఏడెకరాల పొలం కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలకోటయ్య అప్పులపాలయ్యాడు. వాటిని తీర్చే దారిలేక పంట చేలోనే పురుగుల మందు తాగాడు. అనంతరం ఇంటికి వచ్చాడు.

బాలకోటయ్య పరిస్థితి చూసిన కుటుంబ సభ్యులు... ఏమైందని ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టాడు. అప్పులు ఎక్కువ కావడంతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్లు వివరించాడు. స్పందించిన కుటుంబసభ్యులు వెంటనే అతడిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ బాలకోటయ్య మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details