Fake police in Kakinada Beach: పని పాటలేని ఆ యువకుడు డబ్బులు సంపాదించాలనుకున్నాడు. అందుకోసం ఎలాంటి పని చేయ్యాలా అని ఆలోచించాడు. చివరకు నకిలీ పోలీసు అవతారమెత్తాడు. అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేయడం మెుదలుపెట్టాడు. అలా అతని చేతిలో మోసపోయిన బాధితుడు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
పోలీసు అవతారమెత్తాడు.. కటకటాల పాలయ్యాడు - Fake police in Andhra Pradesh
Fake police in Andhra Pradesh: పోలీసునంటూ మోసాలు చేసే ఘటనలు చాలానే చూస్తున్నాం. అయితే అతగాడు కష్టపడటం ఎందుకులే అనుకున్నాడో ఏమో పోలీసు అవతారం ఎత్తాడు. తాను పోలీసునంటూ బీచ్‌కు వచ్చే పర్యటకుల నుంచి డబ్బులు వసూలు చేయడం మెుదలుపెట్టాడు. ఓ అమాయకుడి వద్ద నుంచి రూ. 78 వేల నగుదు ఎత్తుకెళ్లాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు.. పోలీసులను ఆశ్రయించగా.. వారు దుండగుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
![పోలీసు అవతారమెత్తాడు.. కటకటాల పాలయ్యాడు fake police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16743055-364-16743055-1666707083816.jpg)
fake police
కాకినాడ బీచ్‌లో పోలీసులమని చెప్పి, పర్యటకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసు నల్లా శివను పెదపూడి పోలీసులు అరెస్టు చేశారు. పెదపూడి మండలంలోని పైన గ్రామానికి చెందిన వీరభద్రం అనే వ్యక్తి నుంచి రూ.78వేల నగదును దుండగుడు ఎత్తుకెళ్లాడు. ఫిర్యాదు అందుకున్న పెదపూడి పోలీసులు దర్యాప్తు చేసి ఎఫ్‌కే పాలానికి చెందిన నల్లా శివను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి బైక్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.
పోలీసు అవతారమెత్తి డబ్బులు వసూలు
ఇవీ చదవండి: